Monday, 30 August 2010
సద్వాక్యాలు
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహీ ధియోయోనః ప్రచోదయాత్
1.దుఃఖంలో కలతచెందడం మానవీయం.దుఃఖాన్ని దూరం చేయడం దేవతాతుల్యం
2. నమ్రతతో కూడిన ప్రసన్నత గొప్పతనానికి గుర్తు
3. చెడ్డవాణ్ణి ద్వేషించకు,చెడుకు సహాయ నిరాకరణ చెయ్యి
4. పంచిన కొలది పెరిగేది మంచితనం ఒక్కటే
5.కష్టాన్ని మించిన ఫాఠశాల లేదు
6. నిజమైన స్నేహం నిలువ సొమ్ము
7. అందరినీ సంతోషపెట్టాలని అనుకునేవాడు ఎవరినీ సంతోష పెట్టలేడు.
8. సమాజసేవలో గంధపు చెక్కల అరిగిపొ:ఇనుములా త్రుప్పుపట్టకు
9. చొక్కాలకన్న సులువుగా తన అభిప్రాయాలను మార్చుకునేవాడు చపలచిత్తుడు.
10. ఉన్నత స్థానాలవైపు నడిచేకొలది మన నడతలో ఉదాత్తత పెరగాలి
11. కోపాన్ని జయిస్తే-అన్నింటినీ జయించినట్లే
12. భవిష్యత్తుపై కాక-గతంపై ఆధారపడి ఉంటుంది మనిషి గమ్యం
13. క్రోధ,అవమానాలను ఎదుర్కొనగలిగే ఒకే ఒక ఆయుధం చిరునవ్వు.
14. తనను తాను విమర్శించుకోవడం వివేకం.ఇతరులను విమర్శించడం అవివేకం.
15. బలవంతులు క్రుషినీ,బలహీనులు అద్రుష్టాన్నీ నమ్ముకుంటారు.
16. ఇతరుల స్వేచ్చను హరించేవారు స్వేచ్చకు అనర్హులు
17.ఓటమి గురుంచి కాక-ఆశ,విశ్వాసం,విజయాల గురుంచి మాట్లాడు
18.నిజాయితీయే ప్రతిష్టకు పునాదిరాయి
19.దారి ఎప్పుడూ మూసి ఉండదు.తరచు జనమే థ్యైర్యాన్ని కోల్పోతారు
20.భావ సంపద థన సంపదకన్న మిన్న
21. ప్రేమించె వ్యక్తికి దడించే అధికారం ఉంటుంది.
22.స్నేహం దుఃఖాన్ని భాగిస్తుంది.ఆనందాన్ని హెచ్చిస్తుంది
www.awgpsouth.org
www.awgp.org
www.e-gurukul.net
www.th8revolution.com
www.dsvv.org
www.diya.net.in
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment